చాలా వరకు మాస్కులూ కాపాడుతున్నయ్

చాలా వరకు మాస్కులూ కాపాడుతున్నయ్

మాస్కులూ కరోనా తీవ్రతను చాలా వరకు తగ్గిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హెచ్ఐవీ ( ఎయిడ్స్)పై స్టడీ చేస్తున్న సైంటిస్ట్  మోనికా గాంధీ చెప్పారు. మాస్కులు పెట్టుకున్నప్పుడు, పెట్టుకోనప్పుడు వైరస్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆమె అంచనా వేశారు. ఉదాహరణకు డైమండ్  ప్రిన్సెస్షిప్లో ఎవరూ మాస్కులు పెట్టుకోలేదని, దీంతో వైరస్ ఎక్కువగా సోకిందని,వాళలో  47 శాతం మందే అసింప్టమాటిక్ ఉన్నారని ఆమె అంటున్నారు. అదే అంటార్కిటిక్ కు చెందిన అర్జెంటైన్ క్రూయిజ్ షిప్లో ప్యాసింజరకు  సర్జికల్ మాస్కులు, సిబ్బందికి ఎన్95 మాస్కులు ఇచ్చారని, దీంతో వైరస్ వ్యాప్తి లో తీవ్రత తగ్గిందని, వైరల్ లోడ్ ఎక్కువగా లేదని ఆమె చెప్పా రు. ఆ షిప్లోని 81 శాతం మంది పేషెంట్లకు లక్షణాల్లేవని చెప్పారు. అదే విధంగా ఇండియానాలోని పిల్లల డయాలసిస్ సెంటర్
, ఒరెగాన్లోని సీఫుడ్ ప్లాంట్, ముస్సోరిలోని హెయిర్ సెలూన్లలోనూ మాస్కులు వాడారని, అక్కడా అసింప్టమాటిక్ కేసులే ఎక్కువని చెప్పారు. సింగపూర్, వియత్నాం, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లోమాస్కులు ఎక్కువగా వాడారని, కేసులు వచ్చినా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని మోనికా గాంధీ అన్నారు. అంటే మాస్కు పెట్టుకుంటే వైరస్ సోకినా..ఒంట్లోని వైరల్ లోడ్ తక్కువగా ఉంటున్నట్టు తేలిందని ఆమెచెప్పారు. గతంలో వచ్చిన మహమ్మారులను పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. అప్పట్లో మాస్కులు ఎక్కువగా వాడలేదని, కాబట్టి అసింప్టమాటిక్ కేసులు 15 శాతం వరకే ఉన్నాయని ఆమె చెబుతున్నారు. ఎప్పుడైతే మాస్కుల వాడకం
పెరిగిందో అప్పటి నుంచి ఆ అసింప్టమాటిక్ కేసులు 40 నుంచి 45 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. ఇలాంటి అసింప్టమా టిక్ కేసుల్లో ఇమ్యూనిటీ యాక్టివ్  గా పనిచేస్తోందని ఆమె చెప్పారు.