19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

V6 Velugu Posted on Jul 12, 2021

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి మొదలు కానున్నాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.. పందొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు.. ఆగస్టు 13తో ముగియనున్నాయని చెప్పారు. సమావేశాల ఏర్పాట్ల సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సెషన్స్ నడుస్తాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్‌తోపాటు కొవిడ్ రూల్స్‌ను పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ‘ఎంపీలతోపాటు మీడియా కరోనా రూల్స్ పాటించేలా చూస్తాం. ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పకుండా అందరూ చేయించుకోవాలి. దీంతోపాటు టీకా తీసుకోని వారు వ్యాక్సినేషన్ చేయించుకునేలా చేస్తాం’ అని ఓం బిర్లా అన్నారు. 

Tagged loksabha, Vaccination, Parliament Sessions, Covid Protocals , Rajasabha, Speaker Om Birla, Monsoon Sessions 2021, Soacial Distancing

Latest Videos

Subscribe Now

More News