
నైరుతీ రుతుపవానలు వేగంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోజికోడ్, తిరువనంతపురంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి.
భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో కొల్లాం, అలప్పుజా జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది కేరళ విపత్తు నిర్వహణ శాఖ.
సోమవారం తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం జిల్లాలకు మాన్ సూన్ విస్తరించి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.