అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ‘మాన్‌‌‌‌‌‌‌‌స్టర్’

అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ‘మాన్‌‌‌‌‌‌‌‌స్టర్’

ఓ మహిళ. ఆమె భర్తని, కూతురిని ఎవరో ఎత్తుకుపోతారు. వాళ్లని కాపాడమని పోలీసుల్ని ఆశ్రయిస్తుంది. వాళ్లు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఆ పని చేసింది లక్కీ సింగ్ అని అనుమానిస్తారు. కానీ వాళ్లు అతనిని అంత తేలికగా చేరుకోలేరు. ఎందుకంటే అతనో డేంజరస్ మాన్‌‌‌‌‌‌‌‌స్టర్. మరి అతనిని వాళ్లెలా పట్టుకున్నారు, అసలు అతను వాళ్లని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరకాలంటే అక్టోబర్ 21 వరకు ఆగాలి. ఎందుకంటే మోహన్‌‌‌‌‌‌‌‌లాల్ నటించిన ‘మాన్‌‌‌‌‌‌‌‌స్టర్’ మూవీ ఆ రోజే విడుదలవుతోంది. నిన్న ట్రైలర్ రిలీజయ్యింది. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. లక్కీ సింగ్‌‌‌‌‌‌‌‌ పాత్రలో మోహన్‌‌‌‌‌‌‌‌లాల్ టెరిఫిక్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు.

‘లెట్స్ బిగిన్ ద గేమ్’ అంటూ పోలీసుల్ని చాలెంజ్ చేస్తున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాయి. సర్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీగా పంజాబీ యాసలో డైలాగ్స్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. భర్త, కూతురి కోసం ఆరాటపడే మహిళగా మంచు లక్ష్మి నటించింది. హనీ రోజ్, సుదేవ్ నాయర్, జెస్ స్వీజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వైఖాశ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు. మరి మోహన్‌‌‌‌‌‌‌‌లాల్ ఆడే ఆట ఎలా ఉండబోతోందో దివాలీకి థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో  చూడాల్సిందే!