చైనాకు చేరిన చంద్రుడి మట్టి, రాళ్లు

చైనాకు చేరిన చంద్రుడి మట్టి, రాళ్లు

కంప్లీటైన మూన్​ మిషన్

బీజింగ్​: చంద్రుడిపై పరిశోధనల కోసం చైనా చేసిన ప్రయోగం సక్సెస్​ అయింది. ఆ దేశం పంపిన చాంగ్​ఇ–5 స్పేస్​క్రాఫ్ట్​ చంద్రుడిపై ఉండే రాళ్లను, మట్టిని భూమిపైకి గురువారం తీసుకొచ్చింది. ఇలాంటి ప్రయోగం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. చాంగ్​ ఇ–5 ఇన్నర్​ మంగోలియాలోని సిజివాంగ్​లో దిగిందని చైనా నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ (సీఎన్​ఎస్​ఏ) ప్రకటించింది. తమ మిషన్​సక్సెస్​ అయిందని, క్యాప్సూల్​ విజయవంతంగా కిందికి దిగిందని ఈ సంస్థ హెడ్​ జాంగ్​ కెజియన్​ ప్రకటించారు. చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయడం, దానిపై ల్యాండ్​ కావడం, శాంపిళ్లను తీసుకురావడం.. ఈ మూడు పనులను పూర్తి చేయడానికి సీఎన్ఎస్​ఏ 2004లో స్పెషల్​ మిషన్​ను మొదలుపెట్టింది. చాంగ్​ ఇ–5 స్పేస్​క్రాఫ్ట్​ను ఈ ఏడాది నవంబరు 24న ప్రయోగించింది. ఎనిమిది టన్నుల బరువుండే ఈ స్పేస్​క్రాఫ్ట్​లో నాలుగు కాంపోనెంట్స్​ ఉన్నాయి. ఒక కాంపోనెంట్​చంద్రుడిపై డాకింగ్​ స్టేషన్​గా పనిచేస్తూ ప్రయోగాలు నిర్వహిస్తుంది. రెండోది చందమామ ఉపరితలంపైకి వెళ్లి తవ్వకాలు జరిపింది.మూడోది శాంపిళ్లను డాక్​ స్టేషన్​కు తీసుకొచ్చింది. నాలుగో క్యాప్సూల్​స్టేషన్​లోని శాంపిళ్లను భూమిపైకి మోసుకొచ్చింది. శాంపిళ్లను సీఎన్​ఎస్​ఏ రీసెర్చ్ టీమ్​ బీజింగ్​ తీసుకెళ్లి పరిశోధనలు చేస్తుంది.

For More News..

బెంగాల్‌‌‌‌ ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌

సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

రాష్ట్రంలోనే ఫెయిలయిన కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలా?