మోర్భీలోని వంతెన కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

మోర్భీలోని వంతెన కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

దాదాపు 143ఏళ్ల బ్రిటిష్ కాలం నాటి మోర్భీలోని అధునాతన బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 141మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం నిన్నటివరకూ సహాయక చర్యలు కొనసాగించిన రెస్క్యూ సిబ్బంది తాజాగా సెర్చింగ్ ఆపరేషన్ ను నిలిపివేసింది. బాధితులెవరూ తప్పిపోయినట్టు సమాచారం అందనందున రెస్క్యూ ఆపరేషన్ ను ఆపేసినట్టు స్టేట్ కమిషనర్ ఆఫ్ రిలీఫ్ హర్షద్ పటేల్ తెలిపారు. అన్ని దర్యాప్తు సంస్థలతో చర్చించిన తర్వాతే ఈ సెర్చింగ్ ను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు.

అంతకుముందు గుజరాత్ లోని మోర్భీలో పర్యటించిన ప్రధాని మోదీ.. బ్రిడ్జి ప్రమాదస్థలిని పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ నేపథ్యంలో వంతెన కూలిన ఘటనపై  విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులు ఆదేశించింది. అయితే నిందితులుగా పేర్కొన్న తొమ్మిది మంందిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఐదుగురు పరారీలో ఉన్నారు. వంతెన కూలిన దుర్ఘటనకు కారణమైన ఒరేవా గ్రూపులోని తొమ్మిది మంది వ్యక్తులపై IPC సెక్షన్లు 304, 308కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.