
తృణమూల్ చీఫ్, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీని మరింత కలవరపెట్టేలా ఆ రాష్ట్రంలో హిందూత్వ ఆర్గనైజేషన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. బీజేపీ ఐడియాలజికల్ పాట్రన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరేందుకు బెంగాలీలు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. సంస్థ మెంబర్షిప్ డ్రైవ్‌లో వెస్ట్‌బెంగాల్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జూన్ 15 నాటికే ఆర్ఎస్ఎస్లో చేరతామంటూ అప్లికేషన్లు పెట్టుకున్నవారి సంఖ్య 7,700కు చేరింది. 9,392 అప్లికేషన్లతో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మహారాష్ట్ర మూడో స్థానంలో, కర్ణాటక, ఢిల్లీలు నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే (జూన్ 15 నాటికే) అప్లికేషన్ల సంఖ్య 62వేలు దాటింది. 2017లో లక్ష, 2018లో లక్షాపదివేల మంది సంస్థలో మెంబర్స్ అయ్యారు. ఓవరాల్‌గా ఆర్ఎస్ఎస్లో 60లక్షల మెంబర్స్ఉన్నారు. వెస్ట్‌బెంగాల్‌లో 2014 తర్వాతే జాయినింగ్స్ ఊపందుకున్నాయి. 2017లో 7,400గా ఉన్న మెంబర్షిప్స్, 2018లో 9000కు పెరిగింది. 2019 ఫస్ట్ హాఫ్‌లోనే 7,700 అప్లికేషన్లు వచ్చాయి. హిందువుల పట్ల దీదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై వ్యతిరేకత ఉందని, దానికితోడు ఆర్ఎస్ఎస్ చేపట్టే సేవా కార్యక్రమాలకూ యువత అట్రాక్ట్ అవుతున్నారని, కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నవాళ్లలో 70 శాతం మంది 20నుంచి 35ఏండ్లలోపు యువకులేనని, అందులోనూ 60 శాతం మంది శాఖల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆర్గనైజన్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం వల్లే బెంగాల్లో పార్టీ బలపడిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
బెంగాల్ సర్కారుపై సుప్రీం సీరియస్..
వివాదాస్పద మీమ్ తయారుచేసిన బీజేపీ యూత్ లీడర్ ప్రియాంక శర్మ కేసులో బెంగాల్ సర్కారుపై సుప్రీంకోర్టు మండిపడింది.‘‘మేం ఆదేశాలిచ్చిన వెంటనే ఆమె(ప్రియాంక)ను ఎందుకు రిలీజ్ చెయ్యలేదు? ఆర్డర్స్‌ని ఆలస్యంగా పాటించడానికి కారణమేంటి?’’అని ప్రశ్నించిన జడ్జిలు.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎం మమతా బెనర్జీ, నటి ప్రియాంక చోప్రా ఫొటోల్ని మార్ఫ్ చేసి ప్రియాంక రూపొందించిన మీమ్ ఎన్నికల టైమ్‌లో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఐటీ సెక్షన్ల కింద అరెస్టయిన ఆమె, సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే కోర్టు చెప్పినట్లు కాకుండా ఆలస్యంగా విడుదల చేయడం మరో వివాదానికి దారితీసింది.