తెరపైకి కొత్త గ్రామ పంచాయతీలు

తెరపైకి కొత్త గ్రామ పంచాయతీలు

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపోజల్స్ పంపాలని డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2018లో కొత్త పంచాయతీలు ఏర్పాటు కాగా వివిధ కారణాలతో కొన్నింటిని పెండింగ్ పెట్టింది. వాటిని జీపీలుగా మార్చాలని ఎమ్మెల్యేలు చాలా కాలంగా కోరుతున్నారు.500 మంది జనాభా దాటిన ఆవాస ప్రాంతాలను, తండాలను కొత్త జీపీలుగా సెలెక్ట్ చేస్తారు. 

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కొత్త జీపీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో 33 కొత్త జీపీలకు ప్రపోజల్స్​ వెళ్లాయి. యాదాద్రి జిల్లాలో 18, నల్గొండలో 6, సూర్యాపేటలో 9 కొత్త జీపీలకు ప్రపోజల్స్ పంపారు. కొన్ని తేడాలు ఉన్నయని అధికారులు వాటిని తిప్పి పంపించారు.