పెద్ద జాబ్స్ చేసేటోళ్లకే… ఎక్కువ టెన్షన్

పెద్ద జాబ్స్ చేసేటోళ్లకే… ఎక్కువ టెన్షన్

41 లక్షల మంది జాబ్స్‌‌ కట్‌
కరోనాతో జాబ్ మార్కెట్ గల్లంతు
ఇంటర్న్‌‌షిప్‌లూ పోయాయ్
ఐఎల్‌ఓ–ఏడీబీ రిపోర్ట్

న్యూఢిల్లీ: కరోనా వల్ల ఇండియన్ జాబ్ మార్కెట్ గత కొన్ని నెలల నుంచి అతలాకుతలమైంది. ఉద్యోగాలు ఊడి చాలా మంది రోడ్డున పడ్డారు. రోజుకూలీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎన్నో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగాలు వేటుపడుతోన్న వారిలో పెద్ద జాబ్స్ చేసే యువత (యంగ్ వైట్ కాలర్ వర్కర్స్) ఎక్కువని తాజా స్టడీ వెల్లడించింది. ఫైరింగ్ లైన్‌లో వీళ్లేముందంజలో ఉన్నట్టు తెలియజేసింది. కరోనా సంక్షోభంతో ఇండియాలో ఇప్పటి వరకు సుమారు 41 లక్షల మంది యువత తమ జాబ్స్ కోల్పోయినట్టు తెలిసింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ఎంప్లాయిమెంట్ బాగా దెబ్బతిన్నట్టు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ), ఆసియన్ డెవలప్‌‌మెంట్ బ్యాంక్‌‌ (ఏడీబీ) జాయింట్‌‌గా విడుదల చేసిన రిపోర్ట్‌‌లో‌ పేర్కొన్నాయి. దీని ప్రకారం… కరోనా మహమ్మారితో అప్రెంటిస్‌షిప్‌లు మూడింట రెండొంతులు తగ్గాయి. మూడు క్వార్టర్ ఇంటర్న్‌‌షిప్‌లు గల్లంతయ్యాయి. 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న వారు వారు ఎక్కువగా నష్టపోయారు.

గత నెల 50 లక్షల జాబ్స్‌‌ పోయాయ్‌
మనదేశంలో గత నెల సుమారు 50 లక్షల మంది వేతన జీవులు ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. లాక్‌‌డౌన్‌లు ఎత్తివేయడంతో అనధికారిక రంగంలో ఎంప్లాయిమెంట్ రేటు కొద్దిగా పెరిగింది. శాలరీడ్ జాబ్స్ ఒక్కసారి పోతే, మళ్లీకొత్తది సంపాదించుకోవడం కాస్త కష్టమేనని సీఎంఐఈ పేర్కొంది.

దిగువ మధ్య తరగతి ఆదాయ దేశమైన ఇండియా..
ఎడ్యుకేటెడ్ యూత్, జాబ్ మార్కెట్‌‌ విషయంలో మరింత ప్రమాదంలో పడిందని ఐఎల్‌ఓ రిపోర్ట్ తెలిపింది. తక్కువ ఆదాయం ఉన్నయువతలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. అడ్వాన్స్‌డ్ ఎడ్యుకేషన్ లెవల్స్ఉండే పేదదేశాల యువత తమకు సూటయ్యే ఉద్యోగం వెతుక్కోవడం కష్టమవుతోంది. అత్యధిక ఆదాయమున్న దేశాలు బేసిక్ ఎడ్యుకేషనల్ లెవల్స్ ఉన్నా, జాబ్స్‌ దొరుకుతున్నాయని ఐఎల్‌ఓ చెప్పింది. అవసరమైన స్కిల్స్‌కు, జాబ్ సీకర్స్‌కు ఉండే స్కిల్స్‌కు మధ్య అసలు పొంతన ఉండటం లేదని ఐఎల్‌ఓ తెలిపింది. ఉద్యోగం ఉన్నయువత కూడా తమ ఉద్యోగాన్ని సంతోషంగా చేసుకోవడం లేదని పేర్కొంది.

23 శాతం కంపెనీల్లోనే ఇంక్రిమెంట్లు ..
2021–22లో కేవలం 23 శాతం ఇండియన్ కంపెనీలు మాత్రమే ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని డెలాయిట్ ఇండియా 2020 వర్క్‌‌ఫోర్స్అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే చెప్పింది. ఇంక్రిమెంట్ విషయంలో ఫ్యూచర్‌ పర్‌ఫార్మెన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకోనున్నామని ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి. లాక్‌‌డౌన్‌కు ముందు గతేడాది పర్‌ఫార్మెన్స్‌ను తీసుకుని కంపెనీలు ఇంక్రిమెంట్ బడ్జెట్లు నిర్ణయించేవి. కానీ లాక్‌‌డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఫ్యూచర్‌ పర్‌ఫార్మెన్స్‌ను కూడా కంపెనీలు లెక్కలోకి తీసుకుంటున్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు, భవిష్యత్ అవకాశాలను కాపాడేందుకు చాలా రకాల చర్యలు తీసుకోవాలని ఐఎల్‌ఓ–ఏడీబీ రిపోర్ట్ సూచించింది. ఆసియా, పసిఫిక్‌‌రీజన్‌లలో కరోనా రికవరీ ప్రాసెస్‌లో యూత్ ఎంప్లాయిమెంట్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఏడీబీ ఎన్‌జీఓ హెడ్ క్రిష్ మోరిస్ చెప్పారు.

For More News..

కిరాయికి మారుతి కారు.. నెలకు ఎంతంటే?

రాష్ట్రంలో 2,751 కరోనా పాజిటివ్ కేసులు

టిక్‌టాక్ కోసం మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ జోడీ