కాంగ్రెస్ టికెట్ కోసం 1000కి పైగా దరఖాస్తులు.. అప్లై చేయని సీనియర్లు

కాంగ్రెస్ టికెట్ కోసం 1000కి పైగా దరఖాస్తులు.. అప్లై చేయని సీనియర్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి.  ఇవాళ(ఆగస్టు 25) చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.   ఒకే నియోజకవర్గం నుంచి ఒకే కుటుంబం నుంచి వేర్వేరుగా అప్లై చేసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో అప్లై చేసుకున్న వారు కూడా ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి  జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలు అప్లై చేశారు.

అయితే కొందరు సీనియర్ నేతలు ఇంకా  టికెట్ కోసం అప్లై చేసుకోలేదు. జానారెడ్డి, గీతారెడ్డి, వీహెచ్, రేణుకా చౌదరి, నాగం జనార్ధన్ రెడ్డి టికెట్ కోసం అప్లై చేయలేదు.

 ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే.?

రేవంత్ రెడ్డి - కొడంగల్
భట్టి విక్రమార్క - మధిర
అంజన్ కుమార్ యాదవ్- ముషీరాబాద్ 
మధుయాష్కి గౌడ్  - ఎల్బీనగర్
సర్వే సత్యనారాయణ - కంటోన్మెంట్ 
జీవన్ రెడ్డి - జగిత్యాల
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - నల్గొండ
షబ్బీర్ అలీ - కామారెడ్డి
గూడూరి శ్రీనివాస్ - సిద్దిపేట
సీతక్క - ములుగు
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హుజుర్ నగర్ 
రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్ రావు- కరీంనగర్ 
రఘువీర్ రెడ్డి - మిర్యాలగూడ 
 కొండా సురేఖ - వరంగల్ తూర్పు-
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - కొత్తగూడెం
దామోదర రాజనర్సింహా - ఆందోల్
పొన్నం ప్రభాకర్- హుస్నాబాద్