కాలం తీరిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముప్పు .. హైదరాాబాద్ లో 22 లక్షల వాహనాలు

కాలం తీరిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముప్పు ..  హైదరాాబాద్ లో 22 లక్షల వాహనాలు
  • సిటీలో 15 ఏండ్లు దాటిన వాహనాల సంఖ్య 22 లక్షలు
  •     బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 18 లక్షలు,  ఫోర్​ వీలర్స్​ 3.50  లక్షలు
  •       గ్రీన్​టాక్స్​చెల్లించి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు పొందాలంటున్న ఆర్టీఏ ఆఫీసర్లు 
  •      ట్రాఫిక్​ పోలీసులతో కలిసి స్పెషల్​ డ్రైవ్​కు సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో కాలం చెల్లిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు.  త్వరలోనే ట్రాఫిక్​పోలీసులతో కలిసి స్పెషల్​డ్రైవ్​చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 15 ఏండ్లు దాటిన వాహనాలకు తప్పనిసరిగా గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందాల్సి ఉంటుంది.  నగరంలో15 ఏళ్లు దాటిన వాహనాలు లక్షల సంఖ్యలో పెరిగిపోతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది.  ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  కొందరు వాహనదారులు ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్​ సర్టిఫికెట్​లేకుండానే  నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలా రోడ్లపై తిరగడం వల్ల ఇతర వాహనదారులు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది. 

పెరుగుతున్న ప్రమాదాలు

జంట నగరాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న కొత్త వాహనాలకు తోడు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి.  బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కార్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సులు సైతం కాలం తీరిన వాటిలో ఉన్నాయి.  ప్రధానంగా పాత వాహనాలకు ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్​ లేక పోవడం వల్ల ఎక్కువగా కాలుష్యం వెదజల్లడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.  కాలం తీరిన వాహనాల్లో ఎక్కువగా ఆయిల్​లీక్​అవుతుండడం, బ్రేకులు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  

వాహనాలు రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్న సమయంలో ఒక్కో సారి క్లచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు టైట్​గా మారిపోయి కంట్రోల్​కాక యాక్సిడెంట్లు అవుతున్నాయి.  పాత వాహనాలకు ముందుగా ఫిట్​నెస్​ సర్టిఫికెట్​పొందడం, తర్వాత దానికి తరచూ మెయింటెనెన్స్, సర్వీసు చేయిస్తే ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు.  ప్రమాదాల విషయానికి వస్తే  కేంద్ర రోడ్​యాక్సిడెంటల్​స్టాటిస్టిక్స్​రికార్డుల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 2021 సంవత్సరంలో 10  నుంచి 15 సంవత్సరాల పాత వాహనాల వల్ల  2,023 ప్రమాదాలు జరిగితే ఇందులో 643  మంది చనిపోగా, 1380  మందికి గాయాలయ్యాయి.  2022 సంవత్సరంలో  2,279 ప్రమాదాలు జరిగితే ఇందులో 807 మంది చనిపోయారు.  మరో 1472 మందికి గాయాలయ్యాయి.  ఇక 15 సంవత్సరాలు దాటిన వాహనాల వల్ల 2021లో 799 ప్రమాదాలు జరిగితే 219 మంది మృత్యువాత పడ్డారు. మరో 580 మందికి గాయాలయ్యాయి.  2022లో 1306 ప్రమాదాలు జరిగితే 418 మంది మృతి చెందగా 888 మందికి గాయాలయ్యాయి. 

రికార్డు స్థాయిలో వాహనాలు

జీహెచ్ఎంసీ పరిధిలోనే కాలం చెల్లిన వాహనాలు ఎక్కువగా ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు.  ఇలాంటి వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రాష్ట్ర వ్యాప్తంగా 1.60  కోట్ల వరకు ఉన్నట్టు గుర్తించారు.  15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వాహనాల సంఖ్య ఒక్క హైదరాబాద్​ నగరంలోనే 22 లక్షలు ఉన్నట్టు ఆర్టీఎ ఉన్నతాధికారి వెల్లడించారు.  ఇందులో ద్విచక్రవాహనాలు 18 లక్షలు,  ఫోర్​వీలర్లు 3.5 లక్షలు,  మరో 50 వేల ఇతర వెహికల్స్ ఉంటే  ఆర్టీసీ బస్సులు  వెయ్యికి  పైగా ఉన్నాయి.  నిజానికి ఒక్కో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 లక్షల కి. మీ. తిరిగితే దాన్ని నడపడం నిబంధనలకు విరుద్ధం.  అయినా నగరంలో లక్షల  కి.మీ. తిరిగిన బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎన్నో ఉన్నాయి.  ఒక్క ఆర్టీసీ బస్సు 12 లక్షల కి.మీ. తిరిగితే దాని జీవిత కాలం పూర్తయినట్టే.   కానీ ప్రస్తుతం హైదరాబాద్​నగరంలో దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు 15 లక్షలకు పైగా తిరిగినవే ఉన్నాయి.  ఇలా కాలం తీరిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరి కొద్దికాలం పాటు నడుపుకునేందుకే గ్రీన్​ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతి అమల్లో ఉందని ఆ గడువు పూర్తయితే అన్ని రకాల వాహనాలు స్క్రాప్ కిందకే వస్తాయని అధికారులు చెబుతున్నారు.