అయోధ్యలో వందకు పైగా చార్టర్డ్‌‌ ఫ్లైట్స్‌‌

అయోధ్యలో వందకు పైగా చార్టర్డ్‌‌ ఫ్లైట్స్‌‌

జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్స్‌‌ అయోధ్య విమానాశ్రయంలో దిగుతాయనేది అంచనా అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే కొత్తగా అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రద్దీ పెరిగే అవకాశాలున్నాయని పోయినేడు డిసెంబర్‌‌‌‌ 30న ప్రధానిఈ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ని ప్రారంభించారు.

దీని ద్వారా టైర్ టు సిటీలకు నేరుగా కనెక్టివిటీ పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 59.97 లక్షలతో పోలిస్తే పోయినేడు రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 30% పెరిగింది. 96.02 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. అంతేకాదు.. ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌‌లో ఐదు కొత్త విమానాశ్రయాలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. దాంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుతుంది.