Hair fall : తుట్టెలు తుట్టెలుగా జుట్టు రాలిపోతుందా.. ? అయితే ఇవి తింటే చాలు!

Hair fall :  తుట్టెలు తుట్టెలుగా జుట్టు రాలిపోతుందా.. ? అయితే ఇవి తింటే చాలు!

ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలితో జుట్టు రాలడం ( Hair Fall ), పలచడటం, నిస్తేజంగా మారడం వంటి సమస్యలు చాలా మందిలో సర్వసాధారమైయ్యాయి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం రకరకాలు షాంపులు, కండిషనర్లు , మెడిసిన్స్,  చికిత్సలు చేయించుకుంటున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను చెక్ పెట్టేందుకు ఒక ఆయుర్వేద అద్బుతం ఎదురుచూస్తోంది. అదే మన పెరట్లో దొరికే మునగ ( Moringa ).  మునగ జుట్టు పెరుగుదలకు అద్భుతంగా సహాయపడుతుంది అని ఇటీవల కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ వాదనకు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటి? మునగ ఎలా జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం..

మునగ పోషకాల గని !
మునగ ( Moringa) కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఔషధ మొక్క. దీని ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు అన్నీ జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.  జుట్టు ఆరోగ్యానికి విటమిన్ A, B విటమిన్లు, విటమిన్ C, విటమిన్ E అత్యవసరం. మునగలో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ A జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, స్కాల్ప్‌కు తేమను అందిస్తుంది. విటమిన్ B (బయోటిన్) జుట్టు పెరుగుదలకు, బలానికి కీలకం. విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి జుట్టుకు బలాన్ని ఇస్తుంది, విటమిన్ E రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ALSO READ : Good Health: భోజనం తరువాత నిద్ర వస్తుందా.. ఆరోగ్యానికి మంచిదికాదు.. మరి ఏం చేయాలో తెలుసా..

జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ అందేలా. 
అంతే కాకుండా మునగలో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ లోపం జుట్టు రాలడానికి ( Hair Loss ) ఒక ప్రధాన కారణం. మునగలోని ఐరన్ రక్తహీనతను నివారించి జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ అందేలా చేస్తుంది. జింక్ జుట్టు కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. ఈ కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మునగలో లభిస్తాయి. ఇది జుట్టును బలోపేతం చేసి, పెళుసుగా మారకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది.

మునగలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి స్కాల్ప్, జుట్టు కుదుళ్లను రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి.

శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి?
నేరుగా మానవుల జుట్టు తిరిగి పెరుగుతుంది అని నిరూపించే అధ్యయనాలు పరిమితంగా ఉన్నప్పటికీ, మునగ జుట్టు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో చూపించే ప్రాథమిక పరిశోధనలు ఉన్నాయి. కొన్ని జంతువులపై చేసిన అధ్యయనాలు, ముఖ్యంగా కుందేళ్ళపై చేసినవి, మోరింగ సీడ్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలడాన్ని నిరోధించగలదని చూపించాయి. మునగలోని బీటా-సిటోస్టెరాల్ వంటి సమ్మేళనాలు జుట్టు రాలడానికి కారణమయ్యే DHT ( డైహైడ్రోటెస్టోస్టెరాన్ ) హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించగలవని కూడా కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

మునగను ఎలా ఉపయోగించాలి?
మునగను మీ జుట్టు సంరక్షణ దినచర్యలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  మునగ ఆకులను కూరగా వండుకోవచ్చు. దీని పొడిని స్మూతీలు, జ్యూస్‌లు, సూప్‌లు, సలాడ్‌లలో కలుపుకోని తీసుకోవచ్చు. మునగ గింజల నూనెను గోరువెచ్చగా చేసి స్కాల్ప్‌కు సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. రాత్రిపూట అప్లై చేసి ఉదయం తల స్నానం చేయవచ్చు.  మునగ ఆకుల పొడిని అలోవెరా జెల్, కొబ్బరి నూనె, లేదా పెరుగుతో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి -30 నిమిషాల తర్వాత కడిగేయండి. మునగ సప్లిమెంట్లు క్యాప్సూల్స్ రూపంలో కూడా లభిస్తాయి. అయితే, వీటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

మునగ జుట్టు ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది అనేది వ్యక్తిని బట్టి మారుంది. జుట్టు రాలడం అనేది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు కాబట్టి, తీవ్రమైన సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన నిర్ధారణ, చికిత్స తీసుకోవడం ఉత్తమం. మునగను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగానికి మంచిది. ఒత్తుగా ఉండే జుట్టును పొందడంలో ఇది ఒక సహజసిద్ధమైన మద్దతుగా సహాయపడుతుంది.