పోర్చుగల్‌‌‌‌కు షాకిచ్చి తొలిసారి సెమీస్‌‌ చేరిన మొరాకో

పోర్చుగల్‌‌‌‌కు షాకిచ్చి తొలిసారి సెమీస్‌‌ చేరిన మొరాకో

సాకర్‌‌‌‌‌‌‌‌‌‌ లెజెండ్స్‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌‌‌‌ మెస్సీకి  ఖతార్‌‌‌‌ ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. క్వార్టర్స్‌‌‌‌లో అనామక మొరాకో చేతిలో పోర్చుగల్‌‌‌‌ ఓడిపోవడంతో రొనాల్డో కన్నీటితో టోర్నీ నుంచి వైదొలిగాడు. నెదర్లాండ్స్‌‌‌‌తో  క్వార్టర్స్​లో అన్నీతానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాను సెమీస్‌‌‌‌ చేర్చి తన కలల కప్పు ముంగిట నిలిచాడు.

దోహా / లుసైల్: ఫిఫా వరల్డ్​కప్​లో మొరాకో కొత్త చరిత్ర సృష్టించింది. పోర్చుగల్‌‌‌‌  సూపర్‌‌‌‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హార్ట్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేసింది. శనివారం జరిగిన క్వార్టర్​ఫైనల్లో 1–0తో బలమైన పోర్చుగల్​కు చెక్​ పెట్టి సెమీస్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో సెమీస్​లో అడుగు పెట్టిన తొలి ఆఫ్రికన్​ టీమ్​గా రికార్డులకెక్కింది. స్టార్​ ప్లేయర్​ యూసెఫ్​ ఎన్​ నెస్రీ 42వ నిమిషంలో హెడ్డర్‌‌‌‌తో  అద్భుత గోల్​ చేసి  మొరాకోకు హిస్టారిక్‌‌‌‌ విక్టరీ అందించాడు.   గ్రూప్​ స్టేజ్​లో బెల్జియం, ప్రిక్వార్టర్స్​లో స్పెయిన్​కు చెక్ పెట్టిన ఆఫ్రికన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ​ఇప్పుడు పోర్చుగల్​ను తన కోరల్లో బంధించింది. దీంతో1966, 2006లో  తర్వాత సెమీస్​ చేరాలని ఆశించిన పోర్చుగల్‌‌‌‌కు, కెరీర్‌‌‌‌లో వెలితిగా ఉన్న కప్పు అందుకోవాలని ఆశించిన రొనాల్డోకు నిరాశ తప్పలేదు. ప్రిక్వార్టర్స్‌‌‌‌లో రొనాల్డోను చాలాసేపు బెంచ్‌‌‌‌పై ఉంచి రమోస్‌‌‌‌ను ఆడించి హిట్​ కొట్టిన పోర్చుగల్​ ఈసారి 50 నిమిషాల దాకా రొనాల్డోను బెంచ్​పై కూర్చోబెట్టి బోల్తా కొట్టింది. మ్యాచ్​ ముగిసిన తర్వాత రొనాల్డో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించాడు.

మెస్సీసేన ఐదోసారి

మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఐదోసారి సెమీస్​ చేరింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్​ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్​లో 4–3తో నెదర్లాండ్స్​ను ఓడించింది. దీంతో 1930, 1986, 1990, 2014 తర్వాత మరోసారి సెమీస్​ బెర్త్​ను దక్కించుకుంది. షూటౌట్​లో డచ్​ ప్లేయర్లు  వాన్ డిక్​, బెర్గుస్​ కొట్టిన రెండు  షాట్స్​ను అడ్డుకున్న  అర్జెంటీనా ​ కీపర్​ మార్టినేజ్ ​హీరోగా మారాడు. తొలుత రెగ్యులర్​ టైమ్​లో​ ఇరుజట్లు 2–2తో నిలిచాయి. అర్జెంటీనా తరఫున మొలీనా (35వ ని.) మెస్సీ (73వ ని.) గోల్స్​ చేయగా, వెగాస్ట్​ (83, 90+11వ ని.) నెదర్లాండ్స్​కు డబుల్​ గోల్స్​ అందించాడు. మంగళవారం జరిగే సెమీస్​లో క్రొయేషియాతో అర్జెంటీనా తలపడుతుంది.