విమానంలో మంటలు..41 మంది సజీవ దహనం

విమానంలో మంటలు..41 మంది సజీవ దహనం

రష్యాలోని మాస్కో ఎయిర్ పోర్టులో విమానంలో అగ్రి ప్రమాదం జరిగింది.  టేకప్ అయిన కాసేపటికే ఫ్లైట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 41 మంది మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు.

రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే  టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లైట్ లో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులున్నారు.  వీరిలో 41 మంది చనిపోగా.. 37 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని వేసింది. ప్రమాదానికి గల దర్యాప్తు చేస్తుంది కమిటీ.