జైలర్ కోసం అత్యంత ఖరీదైన టికెట్.. ఎవరు కొన్నారో తెలుసా?

జైలర్ కోసం అత్యంత ఖరీదైన టికెట్.. ఎవరు కొన్నారో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జైలర్ మ్యానియా కనిపిస్తోంది. ఈ సినిమా చూడటానికి తలైవా అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా జైలర్ సినిమాకు సంబంధించిన అత్యంత ఖరీదైన టికెట్ అమ్ముడైపోయిందట. బెంగుళూరులోని పీవీఆర్ మల్టిప్లెక్స్ లో ఈ టికెట్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ టికెట్ ఖరీదు అక్షరాలా రూ.2200. ఈ టికెట్ ను ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆయనకు రజనీకాంత్ అంటే చాలా అభిమానమట. రజనీకాంత్ ప్రతీ సినిమాను మొదటిరోజు చూడటం ఆయనకు అలవాటు. అందుకే ఈ సినిమాను కూడా ఎలాగైనా మొదటిరోజు చూడాలనే ఉద్దేశంతో ఖరీదైన టికెట్ కొన్నాడని సమాచారం.  

ఇక ఈ చిత్ర విడుదల సందర్బంగా చెన్నై, బెంగళూరు సిటీలోకి పలు కార్యాలయాలకు, ఆఫీసులకు ఆగస్టు 10న సెలవు ప్రకటించారు. అంతేకాదు కొన్ని కంపెనీలలో జైలర్ టికెట్స్ ఉచితంగా పంచుతున్నారు. ఇక మధురైలోని తిరుపరంకుండ్రం అమ్మన్ ఆలయంలో రజనీకాంత్ అభిమానులు ప్రత్యేక పూజలు కూడా  నిర్వహించారు. సినిమా విజయం సాధించాలని అపూర్వమైన తపస్సు 'మన్ సోరు' సమర్పించి దేవతకు ప్రత్యేక పూజలు చేశారు.