షుగర్ పేషెంట్లలో ఎక్కువ 40 ఏండ్ల లోపు వాళ్లే .!

షుగర్ పేషెంట్లలో ఎక్కువ 40 ఏండ్ల లోపు వాళ్లే .!
  • ప్రతి నలుగురు కొత్త షుగర్​ పేషెంట్లలో ఒక్కరు 40 ఏండ్ల లోపువారే!
  • 18 ఏండ్లలోపు చాలామందికి టైప్-2 డయాబెటిస్​
  • అమ్మాయిల కంటే అబ్బాయిలకే షుగర్​ ముప్పు
  • లైఫ్​స్టైల్, ఒబెసిటీ ప్రధాన కారణం
  • పీజీఐఎంఈఆర్ చండీగఢ్​ స్టడీలో వెల్లడి

చండీగఢ్​: షుగర్ వ్యాధి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని కొత్త పరిశోధనలో తేలింది. డయాబెటిస్​ బారిన పడుతున్న ప్రతి నలుగురు పేషెంట్లలో ఒకరు 40 ఏండ్ల వయస్సులోపు వారేనని సైంటిస్టులు గుర్తించారు. యువతకు కూడా షుగర్​ ముప్పు అధికంగానే ఉన్నట్టు తేల్చారు. దీనికి జీవన విధానంతో, ఒబెసిటీ ప్రధాన కారణమని కనుగొన్నారు. దేశంలోని పట్టణ జనాభాలో 70 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్టు చండీగఢ్​లోని పోస్ట్​ గ్రాడ్యుయేట్​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఈఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్​) పరిశోధకులు గుర్తించారు. 18–65 ఏండ్ల మధ్య వయసున్న వారిపై స్టడీ చేసి, ఈ విషయాలను తేల్చారు. దేశంలో 60% మంది షుగర్​ పేషెంట్లు ఊబకాయులేనని గుర్తించారు. ఇందులో 25–30% మంది బీఎంఐ (బాడీ మాస్​ ఇండెక్స్​) 30 కంటే ఎక్కువగా ఉన్నదని నిర్ధారించారు.

ఒబెసిటీనే అన్ని రోగాలకు కారణం

అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయం ముప్పు వాటిల్లుతున్నదని, ఫలితంగా డయాబెటిస్​ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతున్నదని పీజీఐఎంఈఆర్​కు చెందిన అసోసియేట్​ ప్రొఫెసర్ డాక్టర్​ పూనమ్​ ఖన్నా తెలిపారు. ఒబెసిటీతోనే డయాబెటిస్​, హైబీపీ, హార్ట్​ డిసీజెస్​, క్యాన్సర్​ లాంటి నాన్​ కమ్యూనికేబుల్​డీసీజెస్​ (ఎన్సీడీ) పెరిగిపోతున్నట్టు చెప్పారు. ​ఒబెసిటీలో భారత్.. అమెరికా, చైనా తర్వాత టాప్​10లో ఉన్నదన్నారు. చండీగఢ్​లో 20.4% మంది డయాబెటిస్​తో బాధపడుతున్నట్టు తమ స్టడీలో తేలిందని తెలిపారు. 18 ఏండ్లలోపు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తున్నదని గుర్తించామన్నారు.  ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్​లో మార్పులు చేసుకొని, నిత్యం ఎక్సర్​సైజ్​ చేస్తే హైబీపీ, హార్ట్​ డిసీజెస్​తోపాటు 80 శాతం వరకు టైప్​ 2 డయాబెటిస్​ను తగ్గించుకోవచ్చని తెలిపారు. 5–10 కిలోల బరువు తగ్గినా డయాబెటిస్​తోపాటు కొన్ని రోగాల ముప్పునుంచి తప్పించుకోవచ్చని లేదా పూర్తిగా తగ్గించుకోవచ్చని సూచించారు.