
మల్కాజిగిరి, వెలుగు: మొఘల్ కాలం నాటి వారసత్వ వంటకాలను రుచి చూపిస్తూ దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘హజీ కరీం’ తాజాగా సిటీలోని సైనిక్‌పురిలో ‘కరీమ్స్ మొఘలాయి జైక్వా’ పేరుతో నూతన రెస్టారెంట్ ను ప్రారంభించారు. రాజకుటుంబాల వంటకాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి కోసం ఫుడ్లవర్స్క్యూ కడుతున్నారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే కరీం రెస్టారెంట్ బెస్ట్ ఫుడ్ డిస్టినేషన్ మారింది. కింగ్ జార్జి కుక్ వారసుడిగా హాజీ కరీముద్దీన్ ఫేమస్అయ్యారు. ఓల్డ్ఢిల్లీలో చిన్న స్టాల్ లో మొఘలాయి వంటకాలను ప్రారంభించిన ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బ్రాంచీలను నడుపుతున్నారు..