తల్లీబిడ్డల్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో ట్వీట్..

తల్లీబిడ్డల్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు.. వీడియో ట్వీట్..

చెన్నై: వరదలో కొట్టుకుపోతున్న తల్లీకొడుకుల్ని కొందరు సాహసం చేసి కాపాడిన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. సేలంలోని అనైవరి ముత్తల్ జలపాతానికి పర్యాటకంగా మంచి పేరు ఉంది. దీంతో టూరిస్టులు ఆ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. అయితే రీసెంట్‌గా అక్కడ భారీగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఓ తల్లీకొడుకు చిక్కుకుపోయారు. భారీ నీటి ప్రవాహానికి బయట పడలేకపోయిన ఆ మహిళ.. బిడ్డను పట్టుకుని కొండరాయి ఆసరాగా సాయం కోసం నిలబడింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. రోప్ సాయంతో వారిని సురక్షితంగా పైకి చేర్చారు. 

అధికారులు రోప్ సాయంతో కాపాడేందుక వచ్చిన సమయంలో వాటర్‌ఫాల్‌కు అవతలి వైపు ఉన్న మరికొందరు అరుస్తూ ఉండటాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సీఎం ఎంకే స్టాలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తల్లీకొడుకును సేఫ్‌గా బయటకు తీసుకొచ్చిన అధికారులను ఆయన మెచ్చుకున్నారు. అయితే తల్లీబిడ్డను కాపాడే క్రమంలో ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఒకరిద్దరు అధికారులు అదుపు తప్పి నీటి ప్రవాహంలో పడ్డారు. వాళ్లు ఈదుకుంటూ సురక్షితంగా బయట పడ్డారని సమాచారం. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ఎవరికీ గాయాలవ్వలేదని సేలం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె. గౌతమ్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం: 

బీజేపీలో చేరనున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్?

2500 నాటికి.. ఇండియా ఇట్లుంటదట!

కివీస్‌తో మ్యాచ్.. గెలవకుంటే భారత్‌‌కు కష్టమే