బీఆర్ఎస్ తోనే నష్టాల్లోకి మదర్ డెయిరీ ...పదేండ్ల కాలంలో రూ. 35 కోట్ల లోటు

బీఆర్ఎస్ తోనే నష్టాల్లోకి మదర్ డెయిరీ ...పదేండ్ల కాలంలో  రూ. 35 కోట్ల లోటు
  • లాభాలు చూపుతూ బ్యాంకర్ల వద్ద ల్లోను
  • ఆపై రూ. 10 కోట్ల దాకా జరిగిన అవినీతి 
  •  డెయిరీ చైర్మన్ మధుసూదన్​రెడ్డి కామెంట్స్

యాదాద్రి, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో మదర్​డెయిరీ నష్టాల్లో కూరుకుపోయిందని చైర్మన్​మధుసూదన్​ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన చైర్మన్ల నిర్ణయాల కారణంగా రూ. 35.15 కోట్ల నష్టాలు వచ్చాయని, ఆపై బ్యాంకుల్లో అప్పు కూడా తీసుకున్నారని తెలిపారు. అప్పుల భారం మోపిన బీఆర్ఎస్​ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

2003–-04 నుంచి 2014-–15 వరకు రూ. 10.95 కోట్ల లాభాల్లో మదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెయిరీ నడిచిందని పేర్కొన్నారు. దీంతో పాటు రూ. 12.50 కోట్ల షేర్​ క్యాపిటల్​కూడా ఉందన్నారు. వచ్చిన లాభాలతో ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. బీఆర్ఎస్​కు చెందిన ఒక చైర్మన్​వచ్చాక 2015-–16 నుంచి నష్టాలు ప్రారంభమై 2023–-24 నాటికి రూ. 35.05 కోట్ల లోటులోకి  వెళ్లిందని, షేర్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఖర్చు చేశారని విమర్శించారు. 

సంస్థ నష్టాల్లో కూరుకుపోతుంటే లాభాలు ఉన్నట్టుగా ఆడిట్​చేయిస్తూ.. బ్యాంకర్లకు చూపించి రూ. కోట్లలో లోన్లు తీసుకున్నారని చెప్పారు. పైగా ఇష్టమొచ్చినట్టు ఉద్యోగులను నియమించుకొని పర్మినెంట్ చేశారని, తద్వారా సంస్థపై అదనపు భారం పడిందన్నారు. అప్పులతో పాటు సంస్థలో రూ. 10 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. 

అప్పటి నుంచే పాడి రైతులకు రూ. 22 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు.  ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయన్నారు. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తుంటే, బీఆర్ఎస్​ కోర్టును ఆశ్రయించి అడ్డుకుందని ఆరోపించారు.  నష్టాల్లోని మదర్​ డెయిరీని ఎన్​డీడీబీకి అప్పగించడం ద్వారా లాభాల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.