బిడ్డను మరచి ప్లైట్ ఎక్కింది.. బాబు కోసం ఎయిర్ పోర్టుకు తిరిగొచ్చిన విమానం

బిడ్డను మరచి ప్లైట్ ఎక్కింది.. బాబు కోసం ఎయిర్ పోర్టుకు తిరిగొచ్చిన విమానం

ప్రయాణమనగానే చాలా జాగ్రత్తగా ఉంటాం. వస్తువులను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. హడావుడిగా సాగే జర్నీలో పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతాం . వాళ్లు అటూ ఇటూ వెళ్లకుండా జాగ్రత్త పడతాం . కానీ, ఓ తల్లి మాత్రం ప్రయాణ హడావుడిలో కన్న బిడ్డను మర్చిపోయింది. విమానం ఎక్కేసి హాయిగా కూర్చుంది. ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక గానీ బిడ్డను వెయిటింగ్ హాల్లో వదిలేసి వచ్చానని ఆమెకు గుర్తుకు రాలేదు. దీంతో ఒక్కసారిగా బోరుమంది. కంగారు పడిన సిబ్బంది ఏం జరిగిందని అడగ్గా, బిడ్డను ఎయిర్ పోర్టు వెయిటింగ్ హాల్ లో మర్చిపోయానని చెప్పింది. దీంతో అవాక్కవ్వడం క్యాబిన్ క్రూ వంతైంది. వెంటనే పైలట్లతో విషయం చెప్పిన క్రూ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి సమాచారం ఇచ్చారు. వెనక్కి రావడానికి ఏటీసీ అనుమతి ఇవ్వడంతో, పైలట్లు ఫ్లైట్ ను మళ్లీ జెడ్డాకు తిప్పారు. సినిమాటిక్ గా సాగిన ఈ ఘటన సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా జీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగి న ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.