ఆప‌రేష‌న్ మ‌ద‌ర్ టైగ‌ర్ విఫ‌లం

ఆప‌రేష‌న్ మ‌ద‌ర్ టైగ‌ర్ విఫ‌లం

ఆపరేషన్ మదర్ టైగర్ కు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం అటవీ అధికారులు ముగింపు పలికారు. అర్థరాత్రి తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్కుకు నాలుగు ఆడ పులి పిల్లలను తరలించారు. మూడు రోజులు.. 90 గంటల పాటు శాస్త్రీయంగా, సాంకేతికంగా ఎంత అన్వేషించిన పులి పిల్లలను తల్లి దరికి చేరుకోలేకపోయారు. పాద ముద్రలు, ట్రాప్ కెమెరాలతో తల్లి పులి T108F ని గుర్తించామని అంటున్న అధికారుల మాటలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

మూడు రోజుల ఆపరేషన్ మదర్ టైగర్ ట్రాప్ కెమెరా T108F ట్రేసౌంట్ చిత్రాలు ఇప్పటికీ విడుదల కాలేదు. మరోపక్క బుధవారం అర్థరాత్రి తల్లి పులికి పిల్లలను దగ్గరకు చేర్చేందుకు చేసిన ఆపరేషన్ లో పిల్లలను తల్లి స్వీకరించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ మదర్ టైగర్ సమయంలో రెండు పసి కూనలు అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. సాహసం చెయ్యలేక.. చేతులు ఎత్తేసిన ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు పులి పిల్లలను తిరుపతి జూకు తరలించారు.

ఏపీ రాష్ట్రం నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో మూడు రోజులు పెద్ద పులి కోసం వేట సాగింది. అలా ఇలా కాదు.. 70 డ్రోన్ కెమెరాలతో.. 300 మంది సిబ్బంది జల్లెడ పట్టారు. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చే క్రమంలో.. అటవీ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆపరేషన్ మదర్ పేరుతో.. చేపట్టిన కార్యక్రమం ఉధృతంగా సాగింది. నాలుగు పులి కూనలను.. ప్రత్యేక వాహనం అడవిలోకి తీసుకెళ్లారు అధికారులు. తప్పిపోయిన తల్లి పులిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను సైతం ఉపయోగించారు. కానీ ఫలితం దక్కలేదు.