వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి : ఇన్స్పెక్టర్ అశ్వంత్ కుమార్

వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి : ఇన్స్పెక్టర్ అశ్వంత్ కుమార్

ఇంద్రవెల్లి, వెలుగు: ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా పాటించాలని మోటార్ వెహికల్ సీనియర్ ఇన్​స్పెక్టర్ అశ్వంత్ కుమార్ సూచించారు. భద్రత వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై బుధవారం ఇంద్రవెల్లిలోని క్రెసెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలంటే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలన్నారు. 

పిల్లలు వాహనాలు ఇవ్వద్దని తల్లింద్రులకు సూచించారు. బైకర్లు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్లు రవీందర్, ఫైమా సుల్తానా, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, రంజిత్ కుమార్, ప్రిన్సిపాల్ రుక్మాజీ, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.