ట్రాఫిక్​ జామ్​ ను పట్టించుకోని కానిస్టేబుల్ పై వాహనదారుల ఆగ్రహం

ట్రాఫిక్​ జామ్​ ను పట్టించుకోని కానిస్టేబుల్ పై వాహనదారుల ఆగ్రహం

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ పక్కనపెట్టి.. కేవలం ఫొటోలు తీస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్​ను వాహనదారులు నిలదీశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ కోర్టు రోడ్డులో విద్యుత్ భవన్ సమీపంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ లేకుండా టూవీలర్స్​ నడుపుతున్న వాహనదారులను ఫొటోలు తీస్తున్నాడు. కొద్దీ దూరంలోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్న జంక్షన్ వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను నియంత్రించేందుకు ట్రాఫిక్​ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఆగ్రహంతో కొందరు వాహనదారులు ఫొటోల్లో నిమగ్నమైన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ను అక్కడే నిలదీశారు. "ఓ వైపు ట్రాఫిక్ జామ్ అవుతుంటే.. ఇక్కడ ఫొటోలు తీసుకుంటావా?" అంటూ గట్టిగా అడగడంతో సదరు కానిస్టేబుల్​ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రతిరోజూ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిల్చునే ప్రాంతానికి కొద్ది దూరంలో వాహనాలు జామ్ అవుతుంటాయని, కాలేజీకి వెళ్లే సమయంలో విద్యార్థులు, పేరెంట్స్ తీవ్ర అవస్థలు పడుతుంటారని చెబుతున్నారు.