ఆ సినిమాలు చేయడంపై రిగ్రెట్ ఫీల్ అవుతున్నా

ఆ సినిమాలు చేయడంపై రిగ్రెట్ ఫీల్ అవుతున్నా

అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పిన ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ లాంటి చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అను ఇమ్మాన్యుయేల్‌‌ చెప్పింది. రష్మిక మందన్న లీడ్ రోల్‌‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన నేపథ్యంలో అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘‘ఇందులో దుర్గ పాత్ర విన్నాక తప్పకుండా నటించాలి అనిపించింది. మొదట్లో నా పాత్రను ఎలా రిసీవ్‌‌ చేసుకుంటారో అని భయమేసింది. కానీ రాహుల్‌‌ నా క్యారెక్టర్‌‌‌‌ను డిజైన్ చేసిన విధానంతో హ్యాపీ ఫీలయ్యా. కమర్షియల్‌‌ సినిమాల్లో మాతో కొంత ఓవర్‌‌‌‌ యాక్షన్‌‌ చేయిస్తారు. 

ఇందులోనూ ఓవర్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెషన్స్‌‌ ఇస్తుంటే రాహుల్‌‌ వద్దని, సెటిల్డ్‌‌గా చేయించాడు. ఇక తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్‌‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. అయితే కొన్ని సినిమాలు మాత్రం చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. నాలుగు డ్యాన్స్‌‌ స్టెప్పులు, ఏవో రెండు డైలాగ్స్‌‌ చెప్పించే కమర్షియల్‌‌ సినిమాల వల్ల నటిగా ఎలాంటి సంతృప్తి లభించదు. అందుకే ఇకపై అలాంటివి చేయకూడదని ఫిక్స్ అయ్యా. 

పెద్ద స్టార్స్‌‌తో నటించిన సంతృప్తి ఉంది కానీ కెరీర్‌‌‌‌ పరంగా మాత్రం అసంతృప్తిగానే ఉన్నాను. అలాగని అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు రావాల్సిన సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా. నా స్వస్థలం కేరళ అయినప్పటికీ యూఎస్‌‌ నుంచి వచ్చింది మొదలు హైదరాబాద్‌‌ను వీడలేదు.  ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్‌‌లో ఉన్నాయి” అని చెప్పింది.