సంక్రాంతికే రాధేశ్యామ్ రాక

సంక్రాంతికే రాధేశ్యామ్ రాక

ప్రభాస్ నటించిన  మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రావడం ఖాయం అని  క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రాధాకృష్ణ కుమార్ రూపొందించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాతో ‘రాధేశ్యామ్’ రిలీజ్ కూడా వాయిదా పడనుందనే న్యూస్ వైరల్ అయ్యింది.  కానీ అవన్నీ రూమర్స్‌ అని, రిలీజ్ డేట్  విషయంలో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. పుకార్లను ఎవరూ నమ్మొద్దన్నారు. 

‘రాధేశ్యామ్’ మూవీని ఐదు ఇండియన్ లాంగ్వేజెస్‌‌‌‌తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌‌‌‌ పెరగడంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, కొన్ని ఆంక్షలు పెట్టారు. థియేటర్స్‌‌‌‌ సైతం యాభై శాతం ఆక్యుపెన్సీకి తగ్గించారు. దీంతో చాలా సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. దీంతో ప్రభాస్‌ మూవీని కూడా వాయిదా వేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ అందరి అనుమానాలకు పుల్‌స్టాప్ పెడుతూ ప్రభాస్ ఫ్యాన్స్‌‌‌‌కి గుడ్‌‌‌‌ న్యూస్ చెప్పింది ‘రాధేశ్యామ్’ టీమ్. పూజా హెగ్డే హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.