రామ్ పోతినేనితో బోయపాటి సినిమా ఆరంభం

రామ్ పోతినేనితో బోయపాటి సినిమా ఆరంభం

తెలుగు వెండి తెరపై బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను.. భద్ర', 'తులసి', 'సింహ', 'దమ్ము', 'లెజెండ్', 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ' వంటి సినిమాలను అందించి రికార్డులు బ్రేక్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. కంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీస్ తీస్తూ సౌత్ లోనే గాక నార్త్ లోనూ అభిమానులను మూటగట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను ప్రారంభించారు. 

ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా నేడు (బుధవారం) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ' సినిమాకు  ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అంతటి భారీ హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయనకు ఇది10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడంతో భారీ అంచనాలు నమోదవుతాయని తెలుస్తోంది. 

హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. 

భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం

"బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం".

-శ్రీనివాసా చిట్టూరి, ప్రొడ్యూసర్

 

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకులు భీంసింగ్ ఇక లేరు