సినిమా థియేటర్లు తెరచినా.. జనం ఎవరూ వెళ్లడం లేదు

సినిమా థియేటర్లు తెరచినా.. జనం ఎవరూ వెళ్లడం లేదు

పెద్ద బడ్జెట్ సినిమాలే దిక్కు అంటున్న థియేటర్ల యజమానులు

ఆడియెన్స్​ కోసం నిర్మాతలు ప్లాన్ 

ఒకేసారి పలు భాషల్లో సినిమాలు రిలీజ్

న్యూఢిల్లీ : కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో మూత పడ్డ సినిమా హాల్స్ కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ తెరుచుకున్నాయి. కానీ అంతకుముందు సినిమా హాల్స్‌‌‌‌కున్న క్రేజ్ ఇప్పుడు ఉండటం లేదు. ఆడియెన్స్ తగ్గిపోయారు. దీనికి తోడు అమెజాన్ ప్రైమ్, హాట్‌‌‌‌స్టార్ ప్లస్ డిస్నీ, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్ పెరిగిపోవడం, వాటిలోనే చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చాలామంది థియేటర్ల గడప తొక్కడం లేదు. ఇప్పుడు మళ్లీ ఆడియెన్స్‌‌ను సినిమా థియేటర్లకు రప్పించడం ఇండస్ట్రీకి అతిపెద్ద సవాలుగా మారింది. ప్రేక్షకులను సినిమా హాల్స్‌‌‌‌కు రప్పించడం కోసం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద బడ్జెట్ మూవీలపై ఫోకస్ చేసింది.  బాహుబలి 2.0, కేజీఎఫ్‌‌‌‌ ఛాప్టర్ 1, సాహో మాదిరి పెద్ద బడ్జెట్ సినిమాలను రూపొందించాలని దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తోంది. అంతేకాక ఒకేసారి వివిధ భాషల్లో తెరకెక్కేలా మూవీలను నిర్మించడం ప్రారంభించింది. ఒక్కో లాంగ్వేజ్‌‌‌‌లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌‌‌‌తో  తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషల్లో ఒకేసారి రిలీజ్‌‌‌‌ చేసేలా చూస్తోంది. అంతేకాక ఫ్యాన్ బేస్‌‌‌‌ను పెంచుకునేందుకు బాలీవుడ్ తారలు కూడా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఆర్’ మూవీలో అజయ్ దేవ్‌‌‌‌గణ్, అలియా భట్ నటిస్తున్నారు. అంతేకాక ప్రభాస్ నటిస్తోన్న ఒక ఫిల్మ్‌‌‌‌లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. ‘ఆదిపురుష్’ అనే మరో ఫిల్మ్‌‌‌‌లో ప్రభాస్‌‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు సినిమా వర్గాలు చెప్పాయి.

కేజీఎఫ్ రెండో పార్ట్‌‌‌‌లో యశ్‌‌‌‌తో పాటు సంజయ్ దత్  కనిపించబోతున్నారు.  దక్షిణాదిలో ఉన్న సినీ నిర్మాతలు, స్టూడియోలు కూడా తమ సినిమాల్లో నార్త్ ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లకు ఛాన్స్ ఇస్తున్నట్టు ఫిల్మ్ ట్రేడ్, ఎగ్జిబిషన్ ఎక్స్‌‌‌‌పర్ట్ గిరీష్ జోహార్ చెప్పారు. మల్టి లాంగ్వేజస్ స్టార్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇండివిడ్యువల్ ఫిల్మ్‌‌‌‌కు మార్కెట్‌‌‌‌ను మరింత విస్తరించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, మర్చండైజ్ రైట్స్ వంటి రెవెన్యూ మార్గాలను మరింత పెంచుకోవచ్చని జోహార్ చెప్పారు.

పెద్ద సినిమాలతో చిన్న పట్టణాలు, జిల్లాల్లోని ప్రజలకు మరింత ఎంటర్​టైన్​మెంట్​ ఇవ్వొచ్చని, వారికి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు అంత ఎక్కువ అవకాశాలు ఉండవని ప్రొడ్యూసర్ ప్రియాంక దత్ అన్నారు. పెద్ద నటుల సినిమాల కోసం ఎక్కువగా వేచిచూస్తారని చెప్పారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇటీవల  ఎక్కువగా వార్తల్లో నిలిచింది. డ్రగ్ కేసు వారిని పట్టిపీడిస్తోంది.

రీజనల్ లాంగ్వేజ్ ఇండస్ట్రీస్ నుంచి తొలుత ఫిల్మ్‌‌‌‌లు విడుదలవ్వడం కాస్త బాలీవుడ్ నటులకు ప్రయోజనం చేకూర్చే విషయమేనని కొందరు మీడియా ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌లంటున్నారు. బాలీవుడ్‌‌‌‌లో కూడా పెద్ద స్టార్ల ఫిల్మ్‌‌‌‌లు రిలీజ్‌‌‌‌కు సిద్ధంగా ఉన్నాయి. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’, సల్మాన్ ఖాన్ ‘రాధే’ 2021లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇండియన్​–2 కూడా విడుదలకు రెడీ అవుతోంది.పెద్ద స్టార్ల మూవీలకు ప్రజలు తప్పక థియేటర్లకు వస్తారన్న నమ్మకం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

for MORE NEWS…