పార్లమెంట్ గౌరవాన్ని టీఆర్ఎస్ భ్రష్టుపట్టిస్తోంది

పార్లమెంట్ గౌరవాన్ని టీఆర్ఎస్ భ్రష్టుపట్టిస్తోంది

పార్లమెంట్ గౌరవాన్ని టీఆర్ఎస్ భ్రష్టుపట్టిస్తోందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్ సభలో మాట్లాడిన ఆయన.. బాయిల్డ్ రైస్ పై రాష్ట్రాలతో ఎఫ్ సీఐ సంప్రదింపులు జరుపుతోందన్నారు.  ధాన్యం కొనుగోళ్లపై కావాలనే  తెలంగాణ ఆలస్యం చేసిందన్నారు. ఆలస్యం చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో  వేల కోట్ల మిల్లింగ్ స్కాం జరుగుతోందన్నారు.  మిల్లింగ్ స్కాంపై కేంద్రం విచారణ జరపాలన్నారు.  కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కూడా ధాన్యం కొనడం లేదన్నారు.  దొంగే దొంగ దొంగ అన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మూడుసార్లు పరిమితులు పెంచామన్నారు.