విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ దే బాధ్యత

విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ దే బాధ్యత

టీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్.  టీఆర్ఎస్, కాంగ్రెస్ పొలిటికల్ ఈక్వెషన్ కు వందల మంది బలయ్యారన్నారు. తెలంగాణ ప్రకటించాక వాపస్ ఎందుకు తీసుకున్నారన్నారు.   శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ తర్వాత రెండేళ్లు కాలయాపన చేశారన్నారు. ఎన్డీయే హయాంలో  ఎలాంటి గొడవలు లేకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చామన్నారు  తెలంగాణ వచ్చాక కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు పెట్టలేకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం 2020 వరకు స్థలాన్ని కేటాయించలేదన్నారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. కాళేశ్వరంపై ఇంతవరకు డిపిఆర్ఓ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెట్టినప్పటి నుంచి కెసిఆర్ ఆయన కుటుంబానికి పూనకాలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న కార్యక్రమాలకు నిన్న ప్రధాని మాటల్లో ఎలాంటి తప్పులేదన్నారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు  అవుతుంది ఇంకా ఏం సెంటిమెంట్ అని ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో ఎన్ని లక్షల కోట్లు దోచుకోవాలని చూస్తున్నావని..  కేసీఆర్ ను ప్రశ్నించారు అర్వింద్.

రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ దే బాధ్యత అని అన్నారు.   కేంద్రం ఇచ్చే నిధులను మిషన్ భగీరథకు మళ్లించారన్నారు. రోడ్ల నిధులను మళ్లించి  అప్పులు చేసి రోడ్లు వేశారన్నారు.  ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెరిగిందన్నారు.  700 కోట్లతో  ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులను కేంద్రమే పూర్తి చేసిందన్నారు. ఎంఎంటీఎస్ యాదాద్రి ఎక్స్ టెన్షన్ కు రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములన్నీ లిటిగేషన్ భూములేనన్నారు.

చిరు జగన్ భేటీపై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు

మీరు చేసిన తప్పుకు రైతులను దొంగల్ని చేశారు