నాతో పార్టీలో చేరినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ లేదు

నాతో పార్టీలో చేరినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ లేదు

బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదని హెచ్చరించారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్ గ్యారంటీ ఏంలేదని ఆయన తేల్చి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

‘నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో గెలవడమే నా లక్ష్యం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయి. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తా. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తుకు అవకాశం ఉంది. అందుకే తెరాసపై దూకుడుగా ఉన్నాం. ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పరారుకావడం ఖాయం. డీఎస్ ఏ పార్టీలో చేరాలన్నది ఆయన ఇష్టం’ అని ఎంపీ అర్వింద్ అన్నారు.