ఆర్యవైశ్య సంఘం లీడర్లతో బీజేపీ ఎంపీ అభ్యర్థి భేటీ

ఆర్యవైశ్య సంఘం లీడర్లతో బీజేపీ ఎంపీ అభ్యర్థి భేటీ

మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం బీజేపీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మరిపెడ వైశ్య సంఘం లీడర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు మండలాల్లో అన్ని కుల సంఘాల లీడర్లు కలిసి కమలం పార్టీకి ప్రచారం చేసి గెలిపించుకోవాలని కోరామన్నారు.

ఇందులో భాగంగానే ఆర్యవైశ్య సంఘం లీడర్లను కలిశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం లీడర్లు కార్లపాటి మధు, గర్రెపల్లి శ్రీనివాస్, కాంతారావు, ఒబిలిశెట్టి వేణు, ఉల్లి శీను, బీజేపీ మరిపెడ రూరల్ ప్రెసిడెంట్ గంగాచారి తదితరులు పాల్గొన్నారు.