ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేయాలి : ఎంపీ చామల

ఎంఎంటీఎస్  పనులు పూర్తి చేయాలి : ఎంపీ చామల
  • రైల్వే ఆఫీసర్లతో ఎంపీ చామల

యాదాద్రి, వెలుగు: ఎంఎంటీఎస్​ రైల్వే లైన్​ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రైల్వే అధికారులను కోరారు. సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవను సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రైల్​ నిలయంలో కలిసి వినతిపత్రం అందించారు.

 ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భువనగిరి వరకూ ఏర్పాటు చేసే రైల్వే లైను కోసం భూ సేకరణను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని, రామన్నపేటలో ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా, శబరి, నారాయణాద్రి రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. అనంతరం భూ సేకరణ అంశంపై మేడ్చల్​ మల్కాజ్​గిరి కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడారు. మీటింగ్​లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజీఎం ఉదయనాథ్ కోట్ల, ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్ ఉన్నారు.