మామిడి కాయలు కేజీ రూ.2.70 లక్షలు

మామిడి కాయలు కేజీ రూ.2.70 లక్షలు

ఏడు మామడి కాయలు....నలుగురు బాడీ గార్డులు... ఆరు కాపలా కుక్కలు.  కట్ చేస్తే.... ఆ నలుగురు బార్డీ గార్డులు, ఆరు కాపలా కుక్కలు 24 గంటల పాటు 7 మామడి పండ్లకు రక్షణగా ఉంటాయి. ఏంటీ.... మరీ 7 మామిడి పండ్ల కోసం ఇంత సెక్యూరిటీ అవసరమా అనుకుంటున్నారా. అవును మరీ... ఆ మామిడి పండ్ల రేటెంతో తెలిస్తే ఆశ్చర్యపోవడంతో పాటు షాక్ తినాల్సిందే. అక్కడ పండే మామిడి పండ్ల కేజీ ధర అక్షరాల 2 లక్షల 70వేలు.  ప్రపంచంలోనే అరుదైన రకం. జపాన్ కు చెందిన మియాజాకి అనే వంగడం.

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పరిహర్ అనే వ్యక్తి ఈ అరుదైన మామడి పండ్లను పెంచుతున్నాడు. చెన్నై వెళ్తున్న టైంలో ట్రైన్ లో పరిచయమైన ఓ వ్యక్తి పరిహర్ కు ఈ మొక్క ఇచ్చాడట. వీటికి ఇంత డిమాండ్ ఉందని.... మొక్క నాటినపుడు పరిహర్ కు కూడా తెలియదు. ఈ మధ్యే వీటి కేజీ ధర 2 లక్షల 70వేలని తెలిసింది. దాంతో వీటి రక్షణ కోసం.... కాపలా కుక్కలు, బార్డీ గార్డులను పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చెట్టుకు ఏడు మామిడి పండ్లున్నాయి. వీటికి అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. ఒక్క పండు కోసం ఓ వ్యాపారవేత్తం ఏకంగా 21వేల రూపాయలు ఇచ్చాడట.