కవిత, కేటీఆర్ జైలు కూడు తినడం ఖాయం

కవిత, కేటీఆర్ జైలు కూడు తినడం ఖాయం

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటమి, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు బయటకు రావడం వెనుక ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. కేటీఆర్ కారణంగానే నిజామాబాద్లో కవిత ఓడిపోయిందని అన్నారు. కుంభకోణాల్లో మునిగిపోయిన కల్వకుంట్ల కుటుంబం జైలు పాలవడం ఖాయమని, ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ జైలు కూడు తింటారని అన్నారు. నాలుగైదు రోజుల్లో కవితకు నోటీసులు వస్తాయని, ఎంక్వైరీ అనంతరం ఈడీ అధికారులు అటు నుంచి అటే ఆమెను తీసుకెళ్తారని చెప్పారు. కేటీఆర్ కు సైతం అదే గతి పడుతుందని అర్వింద్ అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన బుద్ధి మార్చుకుంటలేడని అర్వింద్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం చెప్పుచేతల్లో పని చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 8ఏండ్లైనా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అర్వింద్ మండి పడ్డారు. ఇక బీజేపీ నేతలను జోకర్లన్న కేటీఆర్పై ఆయన ఫైర్ అయ్యారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకు తమను జోకర్ అంటే ఊరుకోమని, కేటీఆర్ను ఫుట్ బాల్ ఆడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.