కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు : ఎంపీ డీకే.అరుణ

కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు : ఎంపీ డీకే.అరుణ

గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ డీకే.అరుణ అన్నారు. బీజేపీ బలపరచగా గెలిచిన సర్పంచ్ లు, వార్డు సభ్యులను ఆదివారం రాత్రి గద్వాలలోని తన నివాసంలో సన్మానించారు. 

ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు రామాంజనేయులు, రవికుమార్, శ్యాంరావు, బండల వెంకట్రాములు, రామచంద్రారెడ్డి, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.