తెలంగాణ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి మరువలేనిది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి మరువలేనిది :  ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంథనిలోని కాకా విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 1969 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కాకా వెంకటస్వామి తనదైన శైలిలో కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్నివర్గాలను ఏకం చేయడంలో కాకా కీలకపాత్ర వహించారన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మడేలేశ్వర స్వామి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

రైల్వే కనెక్టివిటీ మెరుగుపడేలా కృషి చేస్తా

పెద్దపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడేలా కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్​ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైల్వే మంత్రిని కలిసి పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయాలని కోరానన్నారు. 

స్పందించిన ఆయన నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయన్నారు. కరీంనగర్,  తిరుపతి రైలుకు పెద్దపల్లిలో హాల్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించేలా కృషి చేశానన్నారు. ఇతర ఎక్స్​ప్రెస్​ రైళ్ల హాల్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను ఎంపీగా గెలిచానని, పెద్దపల్లి అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో సయ్యద్​సజ్జాద్, బండారి సునీల్,  బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీధర్​పటేల్​, శ్రీనివాస్​, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​, శ్రీనివాస్​ పాల్గొన్నారు.

పెగడపల్లి మాజీ జడ్పీటీసీకి పరామర్శ 

కరీంనగర్​:  పెద్దపల్లి జిల్లా పెగడపల్లి మాజీ జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్​లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల రాజేందర్ తల్లి ప్రమీల చనిపోగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫోన్ లో
 పరామర్శించారు.