
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ఉన్నారు. పట్టణంలోని భాగ్యనగర్, హమాలివాడ విశ్వకర్మ కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వక్మ వృత్తి నైపుణ్యం పొందిన వారికి సోమవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అన్ని వృత్తుల వారికి వృత్తి నైపుణ్యం పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తాటిపల్లి రాజు, సుభాష్, ఆకుల ప్రవీణ్, కృష్ణ, గంటా సురేశ్, కనపర్తి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు