మీకు మీరే డాక్టర్లు.. మాస్క్ లేకుండా బయటికి రావొద్దు

మీకు మీరే డాక్టర్లు.. మాస్క్ లేకుండా బయటికి రావొద్దు

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను పర్యటించాలని ప్రధాని మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సనత్‌నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌ను సందర్శించారు. మొదటి నుంచి కోవిడ్‌ను అరికట్టేందుకు ప్రధాని మోడీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిలో కోవిడ్ వార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కోవిడ్‌కి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఇప్పటివరకు లక్ష టెస్టులు చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్లో అనేక రకాల కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ కోవిడ్‌తో పాటు అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నిరకాల సర్వీసులకు 100 బెడ్స్, 470 జనరల్ బెడ్స్, 300 కోవిడ్ బెడ్స్, 150 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ హాస్పిటల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తా. 
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ మన దేశాన్ని మరింత వణికిస్తోంది. మొదటి నుంచి కోవిడ్‌ను అరికట్టేందుకు ప్రధాని మోడీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మీకు మీరే డాక్టర్లు. మాస్క్ లేకుండా బయటికి రావొద్దు. ఆలస్యంగా హాస్పిటల్‌కు రావడం వల్ల వైద్యం చేయడం డాక్టర్లకు కష్టంగా మారుతోంది. అందువల్లే మరణాలు పెరుగుతున్నాయి. కోవిడ్ కష్ట సమయంలో కొంత మంది నరేంద్రమోదీని విమర్శించడం భావ్యం కాదు’ అని ఆయన అన్నారు.