ఆరోగ్య మేళా ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆరోగ్య మేళా ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రోగిని బయటికి  పంపించే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళా క్యాంప్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సరిగా అమలు చేయకపోవడం వల్లే కరోనా సమయంలో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు చనిపోయారని కోమటిరెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగస్వామికాకుండా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పక్క రాష్ట్ర వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే వైద్య ఖర్చు భరిస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని అన్నారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని కోమటి రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న సానూభూతిని వాడుకోవాలి

ఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?