రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో దళితులు, పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించడం వల్లే పెత్తందారి వ్యవస్థ పోయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ కొందరు నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని, కానీ.. రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రతి దళితుడు తమ సొంత ఇంట్లో ఉంటూ చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు నెరవేర్చాలన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..నార్కట్ పల్లి మండలం షాపల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.