చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్‎‎బండ్‎పై పెట్టాలి

చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్‎‎బండ్‎పై పెట్టాలి

భువనగిరి: చాకలి ఐలమ్మ.. ఈ పేరు వింటేనే ఎంతోమందిలో చైతన్యం వస్తుంది. దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ఓ నిప్పురవ్వ. ఈ వీరవణిత పేరు లేకుండా సాయిధ పోరాట చరిత్రే లేదు. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరూలూదింది. అటువంటి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఆలేరులో ఆమె విగ్రహాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు గర్వంగా ఉంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం నాతో చేయించినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి వారి విగ్రహాలు హైదరాబాద్ నడి బొడ్డున ట్యాంక్‎‎బండ్ పైన పెట్టాలి. వీళ్ళ చరిత్రను పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించాలి. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలి. చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఆహ్వానం అందించిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం బాధాకరం’ అని వెంకట్ రెడ్డి అన్నారు.
For More News..

పెళ్లైన నెలకే భార్యను గొంతు కోసి చంపిన భర్త

నేడు ఏపీలోకి గులాబ్ తుఫాన్! తెలంగాణపై ఎఫెక్ట్..

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్