
తిరుమల శ్రీవారికి బంగారు కానుక సమర్పించారు తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఉదయం (సెప్టెంబర్ 23) తిరుమల శ్రీవారికి రూ.60 లక్షల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిన విరాళంగా అందించారు.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు బంగారు కానుక అందించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . అనంతరం కొండా కుటుంబ సభ్యులను సన్మానించారు టీటీడీ ఛైర్మన్ . రంగనాయక మండపంలో పండితుల ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.