
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’లో మెదక్ జిల్లాలోని వడియారం రైల్వే స్టేషన్‌ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఆయన వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణతో పాటు దేశంలోని పలు రైల్వే స్టేషన్లను ఈ స్కీమ్‌లో భాగంగా అభివృద్ధి చేయడం మంచి పరిణామమన్నారు. వడియారం స్టేషన్‌ను ఆధునీకరించడం, మాస్టర్ ప్లాన్ కింద ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ స్టేషన్ మూడు జిల్లాల ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా ఉందని, తూప్రాన్ సమీపంలోని కొత్త ప్రతిపాదిత లాజిస్టిక్ హబ్‌కు సమీపంలో వస్తుందని చెప్పారు. తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.