
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే–163 అభివృద్ధికి సహకరించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి దీనిపై వినతి పత్రం సమర్పించారు. ఘట్కేసర్ మండలంలోని ఔషాపూర్ కు అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ఎస్‌పీఆర్ కాలేజీ దగ్గర జములాపేట్ రోడ్డు వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని లక్ష్మణ్ కోరారు. ఘట్కేసర్ గట్టు మైసమ్మ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బిడ్జి నిర్మాణ పనులపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, పనులకు సంబంధించి అధికారులను ఆదేశించారని లక్ష్మణ్ తెలిపారు.
కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేస్తుండు
అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.