దర్శిని మూవీ పోస్టర్‌‌‌‌ విడుదల

దర్శిని మూవీ పోస్టర్‌‌‌‌ విడుదల

వికాస్.జి.కే, శాంతి హీరో హీరోయిన్స్‌‌గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్శిని’. వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై డాక్టర్ ఎల్‌‌.వి.సూర్యం నిర్మిస్తున్నారు. విడుదల సన్నాహాల్లో ఉన్న ఈ చిత్రం పోస్టర్‌‌‌‌ను ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘విజువల్స్ బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్‌‌ను ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘సరికొత్త కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది’ అని దర్శకుడు చెప్పాడు. ‘ప్రముఖ డిస్ట్రిబ్యూటర్  ద్వారా  సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటిస్తాం’ అని నిర్మాత తెలియజేశారు.