డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ మల్లు రవి

డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి :  ఎంపీ మల్లు రవి
  • ఎంపీ మల్లు రవి  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డిజిటల్ లైబ్రరీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. మంగళవారం నాగర్​కర్నూల్​పట్టణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.3.67 లక్షలతో కంప్యూటర్లను ఏర్పాటు చేశామన్నారు. 

అనంతరం నాగర్​కర్నూల్​మున్సిపల్​పరిధిలో ఉయ్యలవాడ బీసీ గురుకుల పాఠశాలను ఎంపీ, ఎమ్మెల్యే సందర్శించారు. పాఠశాలలో రూ.6.70 లక్షలతో నిర్మించిన మూత్రశాలలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.  

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ 

కందనూలు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు.