పవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి

పవన్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపించు: ఎంపీ మిథున్ రెడ్డి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి.  పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంతో నిపుణులని అన్నారు మిథున్ రెడ్డి. ఇంతకు ముందు కూడా అదే తరహాలో చేశారని.. ఎర్రచందనం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా అంటూ ప్రశ్నించారు మిథున్ రెడ్డి. అప్పట్లో ఆరోపణలు నిరూపించమని అడిగితే తప్పించుకున్నారని అన్నారు మిథున్ రెడ్డి.

ఇప్పుడు హెలీకాఫ్టర్లో చూపించిన భూమి తమ చట్టబద్దమైన సొత్తు అని.. ఆ భూమిని 2000లో కొనుగోలు చేశామని స్పష్టం చేశారు మిథున్ రెడ్డి. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అటవీ భూమిని ఆక్రమించారంటూ పవన్ కళ్యాణ్ చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల స్వయంగా పవన్ కళ్యాణ్ హెలీకాఫ్టర్లో మంగళంపేట అటవీ భూములపై ఏరియల్ సర్వే నిర్వహించి వీడియో తీశారు.

పెద్దిరెడ్డి అటవీ భూమిని ఆక్రమిమించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని.. ఆక్రమణలపై సీఎం చంద్రబాబు, క్యాబినెట్ కు వివరించారు పవన్. పెద్దిరెడ్డి 76.74 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, పెద్దిరెడ్డి మధ్య వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.