ఓబీసీ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టాలి

ఓబీసీ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టాలి
  •     ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ఆర్.కృష్ణయ్య లెటర్

ముషీరాబాద్, వెలుగు :  ఓబీసీల డిమాండ్లను బీజేపీ లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని  మోదీకి లెటర్​రాశారు. దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 14శాతానికి మించడం లేదని వాపోయారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం తగిన వాట కల్పించేందుకు సమగ్ర అధ్యయనం జరగాలన్నారు. ఓబీసీల కోసం కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.