
గజ్వేల్, వెలుగు: స్థానిక సంస్థలలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. ఆదివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. మెదక్ ఎంపీ ఆఫీసులో సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, జీపీపీ మాజీ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వారికి ఎంపీ రఘునందన్ రావు కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ నుంచి వాసవీ క్లబ్ ప్రధాన కార్యదర్శి నవీన్, బీఆర్ఎస్ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ యూత్ పట్టణ ప్రధాన కార్యదర్శి యాదగిరి, నాయకులు గోపి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సత్తయ్య, మాజీ జడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కో-కన్వీనర్ సురేశ్, గజ్వేల్ రూరల్ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, నాయకులు నాగరాజ్ పాల్గొన్నారు.